Ticker

6/recent/ticker-posts

Viveka Case- Ninhydrin Test: వివేకా హత్య కేసును నిన్ హైడ్రిన్ పరీక్ష మలుపు తిప్పనుందా ?

 

వైఎస్‌ వివేక హత్యకేసు విచారణ కీలక మలుపు తీసుకోనుంది. ఈ నెలాఖరులోపు కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు సరైన సాక్షాధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా చెబుతున్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయలేకపోయారన్న అపప్రదను మూటకట్టుకుంది. ఈ క్రమంలో హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌ను నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన అనుమతులు లభించాయి. నిన్‌ హైడ్రీన్‌ పరీక్ష అంశాన్ని సీబీఐ అధికారులు కోర్టు ముందు ఉంచగా, నిందితుల తరపు న్యాయవాదులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇరువైపు వాదనలను విన్న తర్వాత న్యాయస్థానం నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీని ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెబుతోంది. ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. కోర్టు రికార్డులలో లేఖ కలర్‌ జిరాక్స్‌ ను ఉంచేలా అనుమతి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థిగా కోర్టు ఓకే చెప్పింది.

ఏమిటి నిన్‌ హైడ్రీన్‌ పరీక్ష..

వివేక హత్య  జరిగిన ప్రాంతంలో వివేకా రాసినదిగా చెప్తున్న లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. మరోరకంగా చెప్పాలంటే సాక్ష్యంగా మారనుంది. ఒకేవేళ ఎవరైనా బలవంతంగా ఆ కాగితంగా రాయించినట్లతే అనుమానుతుల వేలిముద్రలను గుర్తించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. రసాయనిక ప్రయోగం ద్వారా లేఖ పై వేలిముద్రలను కనుగొంటారు. నిన్‌ హైడ్రీన్‌ ఫార్ములా సి9, హెచ్‌6, ఓ4. దీన్ని యథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. వివేక రాసిన లేఖపై ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తారు లేదా అందులో ముంచి బయటకు తీస్తారు. పదినిమిషాల తర్వాత ఆ లేఖ పై ఎక్కడెక్కడ వేలిముద్రంలో ఉన్నాయో ఆ ప్రాంతం ఊదా రంగు కలర్‌ లోకి మారిపోతుంది. దాన్నిబట్టి నిందితులెవరో తెలుసుకోవచ్చని సీబీఐ చెబుతోంది. నాలుగేళ్ల క్రితం హత్య జరిగిన తర్వాత ఆ లేఖను ఎంతో మంది పట్టుకున్నారు. పోలీసులు, సీబీఐ అధికారులు, కుటుంబీకులు పరిశీలించారు. వీరందరి వేలిముద్రలు ఆ లేఖపై పడి ఉంటాయి. దాంతో అసలు నిందితులెవరో తెలుసుకోవడం చాలా క్లిష్టమైన అంశంగా మారనుంది. ఏది ఏమైనప్పటికీ నిన్‌ హైడ్రీన్‌ పరీక్ష అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Post a Comment

0 Comments

Popular Posts

sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !